![]() |
![]() |
.webp)
జీ 5 లో ప్రసారమయ్యే సీరియల్స్ లో "గుండమ్మ కథ" సీరియల్ ఆడియన్స్ కి ఎంతో ఇష్టమైన సీరియల్. ఐతే ఈ సీరియల్ లో ఇప్పుడు కొంతమంది కొరియోగ్రాఫర్స్ గెస్ట్ రోల్స్ చేయడానికి వెళ్తున్నారు. అంటే అప్పుడప్పుడు సీరియల్స్ లో ఏవో ఒక పాటల పోటీలో, డాన్స్ పోటీలో పెట్టి దాని రిలేటెడ్ ఉన్న కొంతమంది సీనియర్ సెలబ్రిటీస్ ని స్పెషల్ గెస్ట్స్ గా స్పెషల్ ఎపిసోడ్స్ గా ప్లాన్ చేస్తూ ఉండడం మనకు తెలుసు. ఎందుకంటే సీరియల్స్ నార్మల్ గా అలా వెళ్ళిపోతూ ఉన్నా ఆడియన్స్ కిక్ అనేది రాదు. ఒక్కో టైములో సీరియల్ అంటేనే బోర్ కొట్టే పరిస్థితి వస్తుంది. అలా రాకుండా ఉండడం కోసం కొన్ని సీన్స్ ని యాడ్ ఆన్ చేసి ఇలా బుల్లితెర, సిల్వర్ స్క్రీన్ సెలబ్రిటీస్ ని పిలిచే ఆనవాయితీ ఎప్పటినుంచో ఉంది. ఇక ఇప్పుడు కూడా గుండమ్మ సీరియల్ లో కూడా ఇద్దరు సెలబ్రిటీస్ తో ఒక స్పెషల్ ఎపిసోడ్ ని డైరెక్టర్ ప్లాన్ చేశారు.
అదేంటంటే సీరియల్ లో ఒక డాన్స్ కాంపిటీషన్ పెట్టారు. ఆ పోటీకి ఆట సందీప్ ఆయన భార్య జ్యోతి రాజ్ సందీప్ గెస్టులుగా వచ్చారు. ఈ విషయాన్నీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. "గుండమ్మ కథలో సెలబ్రిటీ గెస్ట్ రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ! సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ సీరియల్ ని చూడటం మర్చిపోవద్దు. అలాగే 2,000 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ సీరియల్ మొత్తం టీమ్‌కు అభినందనలు...అలాగే సీరియల్ లో నటించిన పూజా, పల్లవి, చరణ్, అశ్విని, మిగతా టీమ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ మేము కనిపించి ఈ సీరియల్ స్పెషల్ ఎపిసోడ్ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాము ! ఈ డ్యాన్స్ పోటీ ఎపిసోడ్ విన్నర్ ఎవరో కూడా మీరే గెస్ చేయండి" అంటూ పోస్ట్ చేసారు.
![]() |
![]() |